యువశక్తి బారీ బహిరంగ సభను విజయవంతం చేయండి: కరిమజ్జి

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, ఎచ్చెర్ల జనసేన నాయకులు కరిమజ్జి మల్లీశ్వరరావు అధ్వర్యంలో బుడతవలస, బెజ్జిపురం గ్రామంలో మంగళవారం ఉదయం నుండి శరవేగంగా విసృత ప్రచారం మొదలు పెట్టి ప్రతి గ్రామం, ప్రతివాడ, ప్రతి వీధి, ప్రతి పల్లె, ఉరూ..ఊరు ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారంలో కరిమజ్జి మల్లీశ్వరరావు మాట్లాడుతూ మన యువతే మన భవిత.. యువత భవిత గురించి నిర్వహించే బహిరంగ సభ యువశక్తి గురించి ప్రజలకు వివరించడం జరిగింది. జనవరి 12తేదిన పవన్ కళ్యాణ్ గారు రణస్థలం దగ్గర సుభద్ర పురం సెంటర్ వద్ద బహిరంగ సభకు వస్తున్నారు కనుక యువశక్తి బారీ బహిరంగ సభకు ప్రజలు, యువకులు, యువతీ బారి యెత్తున ఈ కార్యక్రమంలో పాల్గోని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణాపురం పంచాయతీ యంపీటీసీ అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు కెల్లా.రాము, రౌతు.పోతినాయుడు రామస్వామి, వడ్డిపిల్లి లలిత, కాంతారావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.