యువగళం- లోకేష్ పాదయాత్రను విజయవంతం చేయండి

రాజోలు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాజోలు నియోజకవర్గంలో జరగనుంది. ఈ నేపధ్యంలో ఈ పాదయాత్ర విజయవంతం చేయుటకై జనసేన – టీడీపీ ఆధ్వర్యంలో సఖినేటిపల్లి మండల స్థాయిలో శనివారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో పాల్గొన్న రాజోలు నియోజకవర్గ జనసేన – టీడీపీ పార్టీల సమన్వయకర్త గుండుబోగుల నరసింహరావు (పెద్దకాపు. రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ మరియు రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి గొల్లపల్లి సూర్యారావు, టీడీపీ రాష్ట్ర నాయకులు పత్తిపాటి పుల్లారావు, కాకినాడ జిల్లా నాయకులు జోతుల నవీన్, రెడ్డి సుబ్రమణ్యం మరియు జనసేన – తెలుగుదేశం పార్టీల రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.