జనసేనాని స్పూర్తితో 5 లక్షల విరాళం ప్రకటించిన మాకినీడి

జిల్లా ఇంచార్జ్ కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో.. కడియపులంక లో శనివారం జరిగిన తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశంలో పిఠాపురం ఇంచార్జ్ మాట్లాడుతూ.. చనిపోయిన కౌలు రైతులకు అండగా 1లక్ష అందజేస్తానని ప్రకటించి, మా అధ్యక్షులు.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల సహాయార్థం 5 కోట్ల రూపాయలు అందజేయడం జరిగిందీ. ఆయన స్ఫూర్తితో పిఠాపురం నియోజకవర్గం తరఫున రైతులను ఆదుకునే విధంగా తన వంతు బాధ్యతగా శ్రీమతి మాకినీడి శేషుకుమారి జనసేన పార్టీ కి 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.