పలు కుటుంబాలను పరామర్శించిన మాకినీడి శేషుకుమారి

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం, గొల్లప్రోలు మండలంలోని కుమారపురం, దుర్గాడ గ్రామాల్లో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి ఇటీవల మరణించిన జనసేన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో ముందుగా కుమారపురంలో పార్టీ ఆవిర్భావము నుంచి పార్టీకి అహర్నిశలు కష్టపడి పార్టీకి గ్రామంలో అనేక సేవలు అందించిన తుమ్మలపల్లి సత్యనారాయణ (చిన్న) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. వీరి కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున అండగా ఉంటానని తెలియజేశారు. అదేవిధంగా 50 కేజీల బియ్యం ప్యాకెట్స్ ను అందజేశారు. అనంతరం అదే గ్రామంలోని నక్క సుబ్బారావు, తుమ్మలపల్లి మాణిక్యం కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం దుర్గాడ గ్రామంలో గొల్లపల్లి అచ్చారావు మరియు గాది ప్రకాష్ రావు ఇళ్ళకు వెళ్లి, వారి చిత్రపటం ముందు మౌనం పాటించి వారి పవిత్రమైన ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుడు ఇవ్వాలని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి.. మానసిక ధైర్యాన్ని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ లు అమరాది వల్లి రామకృష్ణ, గోపు సురేష్, గొల్లపల్లి గంగ, గొల్లపల్లి శ్రీనివాస్, ముమ్మిడి బోడకొండ, పెనుగొండ వెంకటేశ్వరరావు, బండి బుజ్జి, బావిశెట్టి రాంబాబు, ఎలుగుబంటి శివ, జి.వీరాంజనేయులు, కరణం రాజేష్, సత్య, రవి, జనసేన నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.