జనంలో జనసేన గ్రామ సమస్యలు తెలుసుకుంటున్న మాకినీడి శేషుకుమారి…!

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, యు కొత్తపల్లి మండలం మాయ పట్నం కొత్త కాలనీలో జనసేన పార్టీ ఇన్చార్జ్ మాకినీడి శేషుకుమారి మహిళా మత్స్యకారుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ కొంతమంది మహిళలు మాకు రోడ్లు డ్రైనేజీలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, మా బాధ ఏ నాయకుడు అర్థం చేసుకోవడం లేదని, ఓట్ల సమయంలో నాయకులు మీకు అది చేస్తాం ఇది చేస్తామని వస్తున్నారు కానీ మాకు శాశ్వత పరిష్కారం శూన్యం మీరైనా మా కష్టాలు అర్థం చేసుకుని న్యాయం చేస్తారని కోరడం జరిగింది. ఈ సందర్భంగా మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎంపీటీసీ వార్డు నెంబర్ నిద్రపోతున్నారా మీరు సీట్లపై కూర్చోడానికి ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చి ఎప్పుడు గాలికి వదిలేస్తే ప్రజలకు ఎలా మొఖం చూపిస్తారు. ప్రజలకి అండగా జనసేన ఎప్పుడూ ఉంటుందని వారితో ఎలా పని చేయించాలో చేయిద్దాం మీ ఇంటి ఆడపడుచుల మీకు ఎప్పుడూ అండగా ఉంటానని. పవన్ కళ్యాణ్ ఎప్పుడు సామాన్య ప్రజల కోసం తపన పడుతూ చనిపోయిన కౌలు రైతులకు 30 కోట్ల రూపాయలు సొంతం నిధితో ఇవ్వటం జరుగుతుందని తొందరగానే మీ సమస్య పరిష్కారం తీసుకు వచ్చే వరకు మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యు కొత్తపల్లి మండల ప్రెసిడెంట్ పట్టా శివ, కోనాడ సత్తమ్మ, సూరాడ సత్య, సూరాడ శ్రీను, దొడ్డి దుర్గాప్రసాద్, కోన రామకృష్ణ, మేడిశెట్టి కామేష్, పంతాడ దుర్గాప్రసాద్, రాజు, కోనాడ దినాకర్, శివారెడ్డి, శ్రీనివాసరెడ్డి, సూరాడ ప్రతాప్, సొలోమను, సూరాడ దుర్గా తదితరులు పాల్గొన్నారు.