బోనాల ఉత్సవాలలో పాల్గొన్న మాకినీడి శేషుకుమారి

పిఠాపురం, పిఠాపురం మండలం లక్ష్మీనరసాపురం గ్రామంలో మన జనసైనికులు నాయకులు ఆహ్వానం మేరకు పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి, వారి హస్బెండ్ డా.మాకినీడి వీరప్రసాద్ విజయదశమి శరన్నవరాత్రులు సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని నాయకులు జనసైనికులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. తదనంతరం గ్రామ అక్క చెల్లెలతో కలిసి అమ్మవారి బోనాలు మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. విజయదశమి రోజున గ్రామానికి ఆహ్వానించే ఈ అమ్మవారి బోనాలతో నడవటం ఎంతో ఆనందంగా ఉందని అలాగే నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాళ్ల రాజు, భీమరాజు, ఎంపీటీసీ బీశెట్టి గంగా మహేష్, మేళం బాబి, దుర్గాప్రసాద్, బద్దిరెడ్డి నాగేశ్వరరావు, ఆడారి దుర్గ, నాయికల దుర్గాప్రసాద్, లింగంశెట్టి దత్త, ఆలంశెట్టి రాజుబాబు, దొడ్డ సురేష్, కొండపల్లి గణేష్, లింగంశెట్టి వెంకటేష్, కాళ్ల శ్రీను, నాయికల సూర్యనారాయణ, గట్టి కృష్ణ, నాయకులు జనసైనికులు నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.