జనసైనికుడిని పరామర్శించిన మాకినీడి శేషుకుమారి

పిఠాపురం నియోజవర్గం యు కొత్తపల్లి మండలం యండపల్లి గ్రామంలో నిస్వార్థ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని దైవంగా భావించే భక్తుడు.. మొన్న జరిగిన పంచాయితీ ఎలక్షన్ జనసేన వార్డు నెంబర్ గా పోటీ చేసి.. మళ్ళీ వెంటనే జనసేన పార్టీ సింబల్ పై ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిగ్రామంలో జనసేన పార్టీని తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించిన స్వామిరెడ్డి సుబ్రమణ్యం ఇటీవల యాక్సిడెంట్ లో తన కాలు కి గాయం అయ్యి ఆపరేషన్ జరిగింది. విషయంతెలుసుకున్నపిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి నాయకులు, జనసైనికులతో కలిసి యండపల్లి లో వారి నివాసానికి వెళ్లి సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో.. యు కొత్తపల్లి మండల అధ్యక్షులు పట్టా శివ, జిల్లా సంయుక్త కార్యదర్శి చీకట్ల శ్యామ్ కుమార్, స్వామిరెడ్డి అంజి బాబు, పెనుపోతుల నానిబాబు, దొడ్డి జగన్నాథం, దొడ్డి దుర్గాప్రసాద్, సూరడా శ్రీను, స్వామి రెడ్డి అయ్యప్ప స్వామి, పెంట చిన్న, మారిశెట్టి నాగేష్, సి.హెచ్. సురేష్, ఎం వీరబాబు, అడపా చిన్న, ఎం.నాగేశ్వరరావు, డి. బుజ్జి, ఎం నూకరాజు, గణేష్, డి. నాగు, స్వామి రెడ్డి దుర్గాప్రసాద్,జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.