శ్రీశ్రీశ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ ముఖమండప పూజా కార్యక్రమంలో మాకినీడి శేషుకుమారి

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో శ్రీశ్రీశ్రీ పంచాయతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ముఖమండపం మహా సంప్రోక్షణ నందీశ్వర సహిత నవగ్రహ మహా కుంభాభిషేకం ప్రతిష్ట మహోత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు మరియు జనసేన సైనికులు ఆహ్వానం మేరకు దుర్గాడ గ్రామం స్వామివారిని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి దర్శించుకున్నారు. 17వ తేదీ గురువారం మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు దత్తు సోదరులు తెలిపారు. విలేకరులతో మాట్లాడుతు 17వ తేదీ స్వామివారి ఆలయ ముఖ మండపం నందీశ్వర ప్రతిష్ట నవగ్రహ ఆలయం ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ సందర్భంగా 1008 మంది సుహాసిని స్త్రీల చే మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ పూజ కార్యక్రమాలు పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట శ్రీ హయగ్రీవ, శ్రీ లలితా దేవి పీఠాధిపతులు శ్రీ సుదర్శనం దుర్గ మా ఆచార్యులు ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు 18 తేదీ ఉదయం నుండి శాంతి కర్ర ఏకాహం జరుగుతుందని 19వ తేదీ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు దత్తు, వీరబాబు లు వివరించారు కార్యక్రమంలో ఇంటి వీరబాబు, మొగిలి శ్రీనివాసు, కొప్పున రమేష్ పెనుకొండ వెంకటేశ్వరరావు, సకినాల త్రిమూర్తులు, శేఖ సురేషు, వెలుగుల లక్ష్మణ కాపరపు వెంకటరమణ, శివ కోటి అచ్చారావు, వినుకొండ అమ్మాజీ, జనసైనికులు నాయకులు వీర మహిళలు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.