అగ్నిప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాకినీడి

పిఠాపురం నియోజకవర్గం, కొత్తపల్లి మండలం, యండపల్లి గ్రామంలో నివాసముంటున్న కొండ చంటిబాబు తాటాకు ఇల్లు గ్యాస్ లీకేజ్ వల్ల అగ్ని ప్రమాదానికి గురైంది విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి నాయకులతో కలసి కుటుంబాన్ని పరామర్శించి, ఆ కుటుంబానికి రూపాయలు 3000/- ఆర్థిక సహాయం, బియ్యం అందించడం జరిగింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జ్యోతుల శ్రీనివాస్, పెనిపోతుల నాని, స్వామిరెడ్డి అంజిబాబు, గొల్లపల్లి మేకల కృష్ణ, గంగ, మిరియాల సత్తిబాబు, స్వామి రెడ్డి స్వామి, రమణ, నామ దుర్గాప్రసాద్, గుర్రాల దత్తాత్రేయ, ఎం.నగేష్, దూలపూడి రమణ, స్వామి రెడ్డి సాయి, దాసరి శ్రీను, జి.అప్పన్న, బుజ్జి, ఎం.శివ, ఎం.నాగశక్తి, జ్యోతుల శివ, సాల్మన్ రాజు, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.