జింకా విజయకు అండగా నిలిచిన మలిశెట్టి

  • ఆర్థిక సాయం అందించిన జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

రాజంపేట, సిద్దవటం మండలంలోని ఉప్పరపల్లె గ్రామానికి చెందిన జింకా సాంబయ్య సతీమణి జింకా విజయ గత పదేళ్ల నుండి కాలేయ వ్యాధితో బాధపడుతుంది. చికిత్సకు సరిపడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ రెండు నెలల సరిపడా మందుల కొరకు రూ.5000/- సోమవారం జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య చేతుల మీదుగా బాధితురాలికి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దకోట్ల శివాజీ, వినయ్, ప్రసాద్ పాల్గొన్నారు.

Share this content:

Post Comment