పెళ్లకూరు జనసేన అధ్యక్షులుగా మల్లాం విజయ్

సూళ్లూరుపేట, జనసేన పార్టీ ఐదు జిల్లాల్లో జనసేన మండల కమిటీలకు అధ్యక్షుల నియామకం జరిగింది. సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్ళకూరు మండల కమిటీ అధ్యక్షులుగా చెంబేడు గ్రామానికి చెందిన జనసైనికుడు మల్లాం విజయ్ కుమార్ ను సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జి ఉయ్యాల ప్రవీణ్ నియమించడం జరిగింది. పెళ్ళకూరు మండల విజయ్ కుమార్ మాట్లాడుతూ… ఈ అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కు సూళ్లూరుపేట ఇంచార్జి ఉయ్యాల ప్రవీణ్ కు పెళ్ళకూరు మండల జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.