రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ మహిళా ప్రధాన కార్యదర్శిగా మల్లూరు సునీత

రాజంపేట, ఇటీవల ఆంద్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ జనసేన శ్రేణులు మరియు కూటమి నేతలతో కలిసి మల్లూరు సునీతకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానికులు మరియు గ్రామస్తులు అందరి సమక్షంలో ఘనంగా సత్కరించి అభినందించారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం, ఓదివీడు గ్రామపంచాయతీలోని కావాలిపల్లి పక్కనే కుమ్మరపల్లికి చెందిన సామాన్య మధ్యతరగతి బీసీ మహిళా నేతకు గుర్తింపు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రాజంపేట నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుమూల గ్రామంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని కులమతాలకు ప్రాంతాలకు అతీతంగా ఎన్డీయే కూటమి తరపున అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమాజంలో మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రోత్సహిస్తున్నారని అదేవిధంగా చట్టసభల్లో 33% రిజర్వేషన్ కేటాయించిన సంగతి తెలిసిందే, కావున ఇటువంటి అవకాశాలను మరెందరో మహిళలు ఉత్సాహంగా ముందుకు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, కూటమి నేతలు, నీటిసంఘం అధ్యక్షులు టి.ఆనందరెడ్డి, నంద్యాల సిద్దయ్య, సాదు ప్రతాప్ రెడ్డి, జి.సుబ్రహ్మణ్యం, సాయిరామ్, వెంకటేష్, నాగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment