విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి.. బాధిత కుటుంబానికి అండగానిలచిన జనసేన

హుజూర్ నగర్ నియోజకవర్గం: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం నేరేడుచర్ల పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు సందర్భంగా విద్యుత్ పోల్స్ కి లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సరైన వైరింగ్ లేక విద్యుత్ పోల్స్ కి కరెంట్ షాక్ వస్తుంది.. ఈ క్రమంలో విద్యుత్ పోల్ వద్దనుండి డివైడర్ దాటుతుండగా షాక్ కొట్టి ఒక వ్యక్తి మరణించడం జరిగింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని హుజూర్నగర్ జనసేన పార్టీ ఇన్చార్జి సరికొప్పుల నాగేశ్వరరావు మరియు స్థానిక నాయకులు న్యాయపోరాటానికి దిగడం జరిగినది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాటం ఆగదని ఎస్ఐ తో వాగ్వివాదం జరిగింది. సుదీర్ఘంగా మూడు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. చివరిగా అధికారులతో మాట్లాడి ఆ కుటుంబానికి తగు న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో మృతదేహాన్ని పోస్టుమార్టం అనుమతించడం జరిగింది. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ తరఫున అండగా ఉంటుందని హుజూర్నగర్ జనసేన పార్టీ ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వరావు తెలియజేయడం జరిగినది.