లింగాల గుడి గ్రామంలో మన ఊరు మన ఆట జనసేన సాంస్కృతిక కార్యక్రమాలు

అల్లూరీ సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం, లోతుగెడ్డ పంచాయితీ పరిదిలోని లింగాలగుడి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు వంతల రాజారావు, శేఖర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సూచించిన అదేశాలమేరకు మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా ముగ్గులు పోటీ నిర్వహించారు. విజేతలైన వారికి ప్రథమ బహుమతి 500 వంతల కుమారి, ద్వితీయ బహుమతి 300 రూపాయలు కుందురు బుజ్జి, తృతీయ బహుమతి 200 రూపాయలు గుంట పూర్ణిమకు బహుమతులు చింతపల్లి మండల ఉపాధ్యక్షులు వంతల రాజరావు అందించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, లక్ష్యాలు వారికి వివరించారు. అలాగే పాడేరు జనసేన పార్టీ ఇన్చార్జ్, డా. గంగులయ్యకి, గిరిజన ప్రజలకు వివిధ మండల, జిల్లా నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ గిరిజన ప్రజలకు ఈ సంక్రాంతి బోగబాగ్యాలివ్వాలని కోరారు.