ఘనంగా మనఊరు మనఆట సంక్రాంతి సంబరాలు

విజయవాడ తూర్పు నియోజకవర్గం: జనసేన పార్టీ ఆదేశాల మేరకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మూడవరోజు 14వ డివిజన్ అధ్యక్షులు యడ్లపల్లి శివ నాగరాజు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ మరియు స్లో సైక్లింగ్ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో వీరమహిళలు & స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పాల్గొని ముగ్గుల పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన వీరమహిళలకు బహుమతులను ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ ఉపాధ్యక్షులు ప్రసాద్, 19 డివిజన్ అధ్యక్షులు వటాల హరిప్రసాద్, వటాల నాగమణి, 8వ డివిజన్ అధ్యక్షులు మట్టా వివేక్, సిహెచ్ యోగి, శెట్టి స్రవంతి, యమ శివ నారాయణ, కాలవ నాని, పడాల శివ ప్రసాద్, గోపీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.