మండపేట నియోజకవర్గ జనసేన శ్రేణులను అభినందించిన జనసేనాని

మండపేట, రాష్ట్ర రహదారులు నరకపు దారులుగా మారడంతో మరమ్మతుల బాధ్యత జనసేన చేపట్టింది. ప్రమాదకరంగా మారిన ద్వారపూడి – మండపేట ప్రధాన రహదారికి జనసేనపార్టీ శ్రమదానం ద్వారా మరమ్మతులు చేపట్టింది. పార్టీ పి.ఏ.సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ సమక్షంలో 2కి.మీ.మేర మరమ్మతులు చేశారు. నాయకులకు, జనసైనికులు అందరికీ ప్రత్యేక అభినందనలు. రహదారిలపై నిలువెత్తు గోతులు ఉన్నా వైసీపీ ప్రభుత్వనికి పట్టదు. తట్టెడు మట్టి పోయాలన్న స్పృహ లేదు. గత రెండేళ్ళలో కేటాయించిన రూ.13వేల కోట్ల బడ్జెట్, రోడ్ల కోసం చేసిన అప్పులు ఎటుపోయాయి. పార్టీ పరంగా జనసేన ఏ కార్యక్రమం చేపట్టినా ముందుగా శ్రమదానంతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేస్తాం. బాధ్యత తీసుకోవడం అంటే ఇదీ.