మంగళగిరి మండలం, పెదవడ్లపూడి జనసేన పార్టీ గ్రామ కమిటీ నియామకం

మంగళగిరి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పెదవడ్లపూడి జనసేన పార్టీ గ్రామ కమిటీ సభ్యులను నియమించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి పెదవడ్లపూడి నుంచి భారీ ర్యాలీతో కమిటీ సభ్యులందరూ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంకు చేరుకోవడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదగా నూతనంగా నియమతులైన పెదవడ్లపూడి గ్రామ కమిటీ సభ్యులకు నియమక పత్రాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గతంతో పోల్చుకుంటే నేడు పెదవడ్లపూడిలో జనసేన పార్టీ బలం పెరిగిందని, పెదవడ్లపూడి గ్రామ కమిటీ నియమించడానికి సమావేశం నిర్వహిస్తే పార్టీ బలోపేతానికి మేము కృషి చేస్తామంటూ దాదాపుగా 90 మంది ముందుకు వచ్చి స్వచ్ఛందంగా పేర్లు ఇవ్వడం జరిగిందని, ఎక్కడా ఏ పార్టీలో లేనివిధంగా 90 మందితో గ్రామ కమిటీ వేయటం చాలా ఆనందదాయకంగా ఉందని అన్నారు. అన్ని గ్రామాల్లోనూ పార్టీ బలపడుతుందని, స్థానిక ఎన్నికల్లో కూడా పార్టీ తరఫున అభ్యర్థులు నిలబడి స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచే విధంగా తోర్పడాలని అన్నారు. రాబోయేది జనసేన ప్రభుత్వమే మనందరం పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో భాగంగా మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేసి పవన్ కళ్యాణ్ గారు 2024 లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవిధంగా పనిచేయాలని, అలాగే రానున్న రోజుల్లో మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో, గ్రామస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనే రేపటి భవిష్యత్తు మారుతుందని, మనందరం కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. నూతనంగా నియమతులైన పెదవడ్లపూడి గ్రామ కమిటీ సభ్యులు గ్రామ అధ్యక్షులు: నడపన దుర్గారావు, గ్రామ ఉపాధ్యక్షులు: మందపాటి రమేష్, బొల్లా అంకబాబు, బరిగే వెంకట నరసింహారావు, పడాల వెంకటేశ్వరరావు, ముప్పిన గోవిందు, ప్రధాన కార్యదర్శిలు: మారేళ్ళ నాగేశ్వరరావు, ఓదూరి సతీష్, కోలా సతీష్, కొలనుకొండ శివన్నారాయణ, దిండు శ్రీరాములు, మీసాల శివనాగులు, కుక్కమళ్ళ రాఘవ, లింగినేని శ్రీనివాసరావు. కార్యదర్శులు : సయ్యద్ సైదా, లింగినేని కృష్ణ, కర్రీ గోపి, కారుమూరి దివాకర్ గుప్తా, పెన్నాడ గోపికృష్ణ, షేక్ షమీరుల్లా, రౌతు శ్రీకాంత్, ఓదూరి రవికాంత్. సంయుక్త కార్యదర్శులు: కాపారపు మురళి, కటకం భరత్, గుడిమెట్ల అఖిల్, ముళ్ళపూడి సుబ్బారావు, ముప్పిన రాంబాబు, గంటా బాలకృష్ణ, సయ్యద్ అక్బర్, లింగినేని శివరామకృష్ణ, పెనుమర్చి దుర్గారావు. నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులకి చిల్లపల్లి శ్రీనివాసరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీ రావు, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, కాపు సంక్షేమ సేన మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు- జనసేన నాయకులు తిరుమలశెట్టి కొండలరావు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి శివ నాగేంద్రం, ఎంటిఎంసీ ఉపాధ్యక్షులు షేక్ కైరుల్లా, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, ఈవని-1 ఎంటిఎంసీ, దుగ్గిరాల మండల ఎంపీపీ శ్రీమతి పసుపులేటి సాయి చైతన్య, ఎంటిఎంసీ కమిటీ ప్రధాన కార్యదర్శి బళ్ళ ఉమామహేశ్వరరావు, ఎంటిఎంసీ కమిటీ కార్యదర్శులు షేక్ వజీర్ భాష, కామేష్, దాసరి వెంకటేశ్వరరావు, మంగళగిరి మండల కార్యదర్శి లింగినేని రవితేజ, యర్రబాలెం గ్రామ అధ్యక్షులు సుందరయ్య, మంగళగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందం మోహన్ రావు, మంగళగిరి పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, చిల్లపల్లి యూత్ సభ్యులు బేతపూడి ప్రశాంత్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.