తిరువూరు నియోజకవర్గం, ఏ.కొండూరు మండలంలోని ఏ కొండూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణయందుగల డయాలసిస్ సెంటర్ ను మంగళవారం సందర్శించి డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ వ్యాధి బాధితులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి డయాలసిస్ యూనిట్ ఇన్చార్జి అనిల్ కుమార్ ను అడిగి తెలుసుకున్న తిరువూరు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా ఏ కొండూరు మండల పరిసర ప్రాంతంలో ఉద్దానానికి తీసిపోని విధంగా ఉన్న కిడ్నీ వ్యాధిని శాశ్వతంగా తరిమికొట్టే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆయన అన్నారు. కిడ్నీ వ్యాధి బాధితులకు డయాలసిస్ సెంటర్లో అందుతున్న వైద్య సౌకర్యాల గురించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిందని, అలానే డయాలసిస్ ఇంచార్జ్ అనిల్ అందించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ డయాలసిస్ కేంద్రంలో మూడు డయాలసిస్ యూనిట్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా డయాలసిస్ పేషెంట్లకు సేవలందిస్తున్నాయని రోజుకు డయాలసిస్ సెంటర్ కు 9 నుంచి 10 మంది పేషెంట్లు వస్తున్నారని, నెలకు సుమారు 250 మంది డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్ చేయించుకుంటునట్లు అనిల్ కుమార్ తెలిపినట్లు శ్రీనివాసరావు అన్నారు చెప్పారు. ఇటీవల డిఎంహెచ్వో ఆదేశాలతో విజయవాడలోని ప్రముఖ కిడ్నీ వ్యాధి వైద్య నిపుణులు సుమారు 26 మంది వైద్యులు ఉచితంగా సేవలు అందించడానికి ముందుకు వచ్చారని, ముందుకు వచ్చిన వారి సేవలను ఏ కొండూరు ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్లో అందిస్తున్నారని ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు కిడ్నీ వ్యాధి వైద్య నిపుణులు సేవలు అందిస్తున్నారని, మరియు డయాలసిస్ సెంటర్లో నలుగురు సిబ్బంది సేవలు అందిస్తున్నామని, ప్రతి బుధవారం, శనివారం డయాలసిస్ కోసం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన అంబులెన్స్ ద్వారా కిడ్నీ వ్యాధి బాధితులను పంపించడం జరుగుతుందని ఆయన తెలిపినట్లు శ్రీనివాసరావు అన్నారు. ఈ డయాలసిస్ సెంటర్ కు 26 మంది కిడ్నీ వ్యాధి బాధితులు డయాలసిస్ కొరకు వారికి కేటాయించిన తేదీలలో కొండూరులోని డయాలసిస్ కేంద్రానికి వస్తున్నారని అనిల్ కుమార్ తెలియజేశారన్నారు. ఇదే సందర్భంలో ఏ.కొండూరు మండలంలోని కిడ్నీ వ్యాధి బాధితుల సమాచారం గురించి ఏ కొండూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ సూపర్వైజర్ ఎం మురళి ని వివరణ కోరగా ఆయన అందించిన సమాచారం ప్రకారం ఏ. కొండూరు మండలంలో 33 మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారని వారిలో నలుగురు పేషెంట్లు సరైన సమయానికి వైద్య సహాయం తీసుకోవట్లేదని, 13 మంది డయాలసిస్ పేషెంట్లు గిరిజన తండాల నుంచి ఉన్నట్లు 20 మంది మండలంలోని పలు గ్రామాలనుంచి ఉన్నట్లు ఆయన తెలిపారని, ఇటీవల ఏ కొండూరు మండలంలో 15 తండాల్లో 25 సంవత్సరాలు పైబడిన సుమారు 7000 మంది వ్యక్తులకు రక్త పరీక్షలు చేయించగా 414 మందికి సీరం క్రియాటిన్ లెవెల్ 1.5 ఎంజి/డిఎల్ గా ఉన్నదని, సీరం క్రియాటిన్ 1.5 ఎంజి/డిఎల్ నుంచి 2 ఎంజి/డిఎల్ పైబడిన వారు 200 మంది కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్నట్లు సూపర్వైజర్ మురళి తెలిపినట్లు శ్రీనివాసరావు అన్నారు. 13 రకాల మందులు ఉచితంగా అందజేస్తున్నట్లు ఆయన తెలిపినట్లు శ్రీనివాసరావు అన్నారు, కిడ్నీ వ్యాధి బాధితుల సమస్యపై త్వరలో మరొకమారు గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ ను కలిసి సమగ్ర నివేదిక అందజేయనున్నట్లు మనుబోలు శ్రీనివాసరావు అన్నారు. అలానే కిడ్నీ వ్యాధి బాధితులకు బలమైన పోషకాహారం అందజేయాలని, ఏ కొండూరులోని డయాలసిస్ సెంటర్ ను విస్తరింపజేసి శాశ్వత ప్రాతిపదికన కిడ్నీ వ్యాధి వైద్య నిపుణులను అందుబాటులో ఉంచాలని, మరియు కిడ్నీ వ్యాధి బాధితుల కోసం రక్త నిధిని ఏర్పాటు చేయాలని, అలానే కిడ్నీ వ్యాధి బాధితులు అధికంగా ఉన్న గంపలగూడెం మండలానికి కూడా జల్ జీవన్ మెషిన్ ద్వారా కృష్ణా జలాలు అందించాలని, గంపలగూడెం ప్రభుత్వ వైద్యశాలలో కూడా కిడ్నీవ్యాధి మందులు అందుబాటులో ఉంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు మనుబోలు శ్రీనివాసరావు అన్నారు.
Share this content:
Post Comment