మనుబోలు గణపతి ఆధ్వర్యంలో జనసేనలో చేరిన మత్స్యకార యువత

నెల్లూరు జిల్లా,సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలంలోని, నేలటూరు పాలెం గ్రామంలో, జనసేన పార్టీ ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో మండల కార్యదర్శి కోడి మణికంఠ సమక్షంలో జనసేన పార్టీలో గ్రామ మత్స్యకార యువత చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మనుబోలు గణపతి మాట్లాడుతూ ఈ గ్రామాన్ని 2009 లో తరలిస్తారని హామీ ఇంత వరకు ఇచ్చిన హామీలు జరగకపోగా, ఇప్పటి వరకు తరలించలేదు. పవర్ ప్లాంట్ ఏర్పడడం వల్ల మత్స్యకార జీవనోపాధి కోల్పోయింది. స్థానికులకు ఉపాధి లేక, యువతకు ఉద్యోగాలు లేక జీవనాధారం స్తంభించింది. సర్వేపల్లి నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికలలో పొత్తులో భాగంగా జనసేన-టీడీపీ, ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం, మన గ్రామ యువతకు ఉపాధి కల్పించుకుందాం అని తెలియజేసి పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.