భగత్ సింగ్ కాలనీ ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన మనుక్రాంత్ రెడ్డి

నెల్లూరు నగరంలోని స్థానిక వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ నందు మంగళవారం ప్రమాదవశాత్తు మరణించిన ఇద్దరు కుటుంబాలను గురువారం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలల క్రితమే ప్రభుత్వాన్ని తాము హెచ్చరించామని, కానీ చర్యలు తీసుకోలేదని, అందువల్ల ఈ మరణాలను ప్రభుత్వ హత్యలుగా ఆయన పేర్కొన్నారు. తదనంతరం నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమని, ఇకనైనా అధికారులు నిద్ర మేల్కొని ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, ఆలియా, శ్రీకాంత్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.