శిర్పి గ్రామంలో జనసేన పార్టీలో చేరిన పలు కుటుంబాలు

ఉరవకొండ: బెలుగుప్ప మండలం, శీర్పి గ్రామంలో బెలుగుప్ప మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కాసంశెట్టి సుదీర్ ఆధ్వర్యంలో 10 కుటుంబాల వరకు జనసేన పార్టీలో చేరారు. వారిని పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం కాశంశెట్టి సుధీర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి విధివిధానాలు ఆలోచనలు ప్రజలకు మంచి చేయాలని, ఆశ రాష్ట్రానికి ఆయన చేసే అభివృద్ధి ఇవన్నీ నచ్చి జనసేన పార్టీలోకి శీర్పి గ్రామం ఎస్సీ కాలనీ నుండి పలు కుటుంబాలు జనసేన తీర్థం పుర్చుకున్నాయి అని వారు తెలీజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కాసంశెట్టి సుధీర్, జనసేన పార్టీ నాయకులు నాని, రామాంజి, శేఖర్, వజ్రకరూర్ మండల ప్రధాన కార్యదర్శి సూర్య నాయక్, శ్రీరాములు, ఎర్రి స్వామి, వన్నూరు స్వామి, మల్లికార్జున, హనుమంతు, రామాంజిని, ఈశ్వర్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.