వైసీపీ నుండి జనసేనలోకి పలువురు చేరిక

కొత్తపేట, రావులపాలెం మండలం, దేవరపల్లి గ్రామ శివారు చెల్లురేవు గ్రామం నుండి పలువురు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు వైసీపీ పార్టీ వీడి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి నియోజకవర్గ ఇంఛార్జి బండారు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి బొక్కా ఆదినారాయణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో యండ్ర వెంకటేశ్వరరావు, బొంతు అర్జున్ రావు, బొంతు లోవరాజు, బొంతు శ్రీను, దొమ్మేటి రాధాకృష్ణ, కేతా శ్రీను, కుడుపూడి రామకృష్ణ, కుడుపూడి ఏబేచ్, కొప్పిశెట్టి నాగేశ్వరరావు, సుక్క శ్రీను, గుడాల నాగు, చిట్టూరి దుర్గారావు, బొంతు వీరవెంకట సత్యనారాయణ, చిట్టూరి నాగేంద్ర తదితరులు ఉన్నారు.