పలు సేవా కార్యక్రమాలతో సత్య ఆదర్శ్ పుట్టినరోజు వేడుకలు

రాజోలు: గోగున్నమటం గ్రామానికి చెందిన జనసేన నాయకులు అధిమూలం హరి ప్రసాద్ కుమారుడు సత్య ఆదర్శ్ 7వ పుట్టినరోజు సందర్భంగా రాజోలులో స్టేట్ బ్యాంకు వీధిలో పుట్టుక తోనే అంగ వైకల్యంతో బాధపుడుతున్న గాలిదేవర వీరవెంకట సత్యనారాయణకి మరియు మానసిక వికలాంగుల అనాధ ఆశ్రయంలో మరియు మొగలి కుదురు సత్య సాయి అనాధ ఆశ్రయంలో 36000 రూపాయల నిత్యావసర సరుకులు అందచేశారు. ఈ కార్యకమంలో జనసేన వీరమహిళ ఉలిశెట్టి అన్నపూర్ణ, గోగున్నమటం సర్పెంచు అల్లు విజయ లక్ష్మి, సురేష్ బాబు, జనసేన నాయకులు పోతు కాశి, పంచదార చినబాబు, ఆదిములపు మణికంఠ తదితరులు పాల్గొన్నారు.