బొబ్బిలి జనసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు

బొబ్బిలి నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా బొబ్బిలిలో ఉన్న బాలురు, బాలికలు వసతి గృహల్లో బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి, రాష్ట్ర ఐటి వింగ్ సభ్యులు మరియు ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గేదెల సతీష్, సీనియర్ రాజకీయ నాయకులు బలగ ఆదిత్య కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నలు, పెన్సిల్లు పంపిణి చేయడం జరిగింది. ఇందులో పార్వతీపురం జనసేన సీనియర్ రాజకీయ నాయకులు అల్లు రమేష్, సూర్య నారాయణ, పార్వతిపురం ఐటి కోఆర్డినేటర్ సత్యనారాయణ, ఉల్లి సంతోష్, శంబంగి వెంకటనాయుడు, అక్కపొలు సాయి కిరణ్, జాన్, లెంక శంకర్ రావు, గౌరీ శంకర్, సూర్య, మనోజ్, ప్రసాద్, రామరావు మరియు బొబ్బిలి జనసైనికులు పాల్గొనడం జరిగింది.