పాలవలస ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు

విజయనగరం: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో శనివారం జనసేన అధినేత జనసేనాని పుట్టినరోజు సందర్భంగా వేడుకలలో భాగంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. బీ.సీ కాలనీ 37 డివిజన్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విజయ బ్లడ్ బ్యాంక్ కోట దగ్గర మరియు న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్. మయూరి జంక్షన్ దగ్గర రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.