తెలంగాణా హైకోర్ట్ కీలక నిర్ణయం.. మరియమ్మ లాకప్ డెత్ కేసు సిబిఐకి అప్పగింత..!

తెలంగాణాలో లాకప్ డెత్ వ్యవహారం ఇటీవల సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ లాకప్ డెత్ కి సంబంధించి పోలీసులపై చర్యలు తీసుకున్నా సరే కొందరు మాత్రం వాళ్లకు శిక్ష పడాలి అని డిమాండ్ చేస్తున్నారు.ఇక ఈ వ్యవహారానికి సంబంధించి తెలంగాణా హైకోర్ట్ కూడా సీరియస్ గా తీసుకుంది. లాకప్ డెత్ విషయంలో పోలీసులకు ఇంకా కఠిన శిక్ష పడాలి అని కొందరు డిమాండ్ లు కూడా చేస్తున్నారు. ఇక ఇప్పుడు దీనిపై హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. అడ్డగూడూరులో మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టులో విచారణ జరిగింది నేడు.

పీయూసీఎల్ పిల్ పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది నేడు. మరియమ్మ మృతిపై హైకోర్టుకు విచారణ నివేదిక సమర్పించ్చింది మెజిస్ట్రేట్. మరియమ్మ లాకప్ డెత్ సీబీఐకి అప్పగించదగిన కేసని అభిప్రాయపడిన హైకోర్టు… ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ ఎస్పీకి నోటీసులు ఇచ్చింది. కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కు అప్పగించాలని ఏజీకి ఆదేశాలు ఇవ్వడం సంచలనం అయింది. ఎస్ఐ, కానిస్టేబుల్ ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఏజీ ప్రసాద్ కోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు.

బాధ్యులైన క్రిమినల్ చర్యలు ఏం తీసుకున్నారని ప్రశ్నించిన హైకోర్టుకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. మరియమ్మ కుటుంబానికి పరిహారం చెల్లించినట్లు తెలిపిన ఏజీ ప్రసాద్ పై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారం ప్రాణానికి తిరిగి తీసుకురాలేదని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇతర ఆరోగ్య సమస్యలున్న మరియమ్మ గుండె ఆగి చనిపోయిందని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. రెండో పోస్టుమార్టం నివేదికలో మరియమ్మపై గాయాలున్నాయని హైకోర్టు తెలిపింది. గుండె ఆగిపోయేలా ఎవరైనా కొడతారా అని హైకోర్టు నిలదీసింది. సీబీఐ వంటి స్వతంత్ర సంస్థల దర్యాప్తు అవసరమని హైకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి నోటీసులు జారీ చేసింది. విచారణ ఈనెల 22కి వాయిదా వేసారు.