శ్రీకాకుళం జిల్లా తరఫున జనసేన సభ సక్సెస్ అవడంలో కొరికాన మార్క్

సాధారణంగా రాజకీయ సభలు అంటే జనాలు తరలించడం మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకురావడం సాధారణం. మధ్యలో సభకు వెళ్లేవాళ్లు పడే ఇబ్బందులు బాధలు అందరికి తెలిసినవే ! ఈ బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టే కొరికాన రవికుమార్ దీన్ని ఎంతో సమర్థవంతంగా ఒక టీం వర్క్ గా నిర్వహించి సభకు వచ్చిన జనసేన కార్యకర్తలకు, నాయకులకు, ఇన్చార్జిలకు, అలాగే సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస్సులు అరేంజ్ చేయడంతో పాటు ప్రతి చోట నీరుతో మొదలెట్టి భోజనం వరకు, మధ్యలో సేద తీరడం కోసం మజ్జిగ ప్యాకెట్లతో మొదలుపెట్టి పెరుగన్నం వరకు ప్రతి ఒక్క మెంబర్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మీటింగ్ కు వచ్చే వాళ్ళు వచ్చేటప్పుడు ముఖాల్లో ఏ ఆనందంతో వచ్చారో వెళ్లేటప్పుడు కూడా అదే ఆనందంతో తిరిగి వెళ్లేలా చేయడంలో కొరికాన రవికుమార్ మార్క్ చూపించారు. ఒక అడ్మినిస్ట్రేటర్ నాయకుడైతే ఎలా ఉంటుందో అది కొరికానను చూస్తే అర్థమవుతుందని ఇప్పుడు జనసేనవర్గాల్లో కోడై కూస్తుంది.

Share this content:

Post Comment