మార్కాపురంలో రెచ్చిపోతున్న భూకబ్జాదారులను సహించేది లేదు: ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం అమ్మవారిపల్లి గ్రామనికి చెందిన భూమిని వైసీపీ పార్టీకి చెందిన చోట నేతలు రెండున్నర ఎకరాల భూమికి నకిలీ పాస్ బుక్ తయారు చేయించుకుని భూమి హక్కుదారులను గూండాలతో భయభ్రాంతులను చేయడం జరిగింది. అనంతరం గ్రామస్తులు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ని సహాయం కోరగా తక్షణమే ఇమ్మడి కాశీనాధ్ గ్రామస్థులతో స్థానిక ఆర్డీవో కార్యాలయం నందు వినతిపత్రం అందజేసి గతంలో జరిగిన భూకబ్జాలను వివరించి తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా భూకబ్జాదారులకు సహకరిస్తున్న కొందరు రెవిన్యూ సిబ్బందిని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.