మార్కాపురం జిల్లాగా ప్రకటించాలి – మార్కాపురం జిల్లా సాధన సమితి డిమాండ్

  • వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలి

మార్కాపురం – అత్యంత వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టుకు తక్షణమే నిధుల మంజూరు చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రెస్’క్లబ్ నందు మంగళవారం మార్కాపురం జిల్లా సాధన సమితి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్కాపురం రానున్న దృష్ట్యా ఈబిసి నేస్తం నిధులను విడుదల చేస్తున్న సందర్భంగా మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో మార్కాపురం జిల్లా సాధన సమితి వైస్ చైర్మన్ మరియు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే తగు నిర్ణయం తీసుకొని ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ జిల్లా ఏర్పాటు చేసే విషయంలో అలసత్వం మంచిది కాదన్నారు. వెలిగొండ ప్రాజెక్టు త్వరితగతి నిర్మాణం కోసం వెంటనే నిధులను విడుదల చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా సాధన సమితి నాయకులు షేక్ సైదా, అందే నాసరయ్య, వి.సుదర్శన్, శాసనాల వీరబ్రహ్మం, శిరిగిరి శ్రీనివాసులు, షేక్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.