పోలవరం జనసేనలో భారీ చేరికలు

పోలవరం నియోజకవర్గం: పోలవరం మండలం, ప్రగడపల్లి గ్రామంలో మండల అధ్యక్షులు గుణపర్తి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలవరం నియోజకవర్గ ఇన్చార్జి చిర్రి బాలరాజు సమక్షంలో ఆదివారం సుమారు 40 కుటుంబాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు వచ్చి తాముగా పార్టీలో చేరడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని, పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, మనం కష్టపడి పనిచేసేది మన పిల్లల భవిష్యత్తు కోసం అని, మన జీవితాలు బాగుపడాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావడం చాలా ముఖ్యమని, ఇంతకుముందు సత్యసాయి వాటర్ కోసం ఏదైతే జనసేన పార్టీ పోరాటం చేసి తీసుకు వచ్చిందో, అదే సత్యసాయి వాటర్ మళ్లీ సమస్యలు చిక్కుకోవడం వల్ల కచ్చితంగా మళ్ళీ పోలవరంలో నిరసన కార్యక్రమం చేపడతామని ఆయన తెలిపారు. ప్రజలు అన్నిగమనిస్తున్నారన్నారు. వైసీపీ పతనం ప్రారంభమన్నారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యత్వం కిట్లను చిర్రి బాలరాజు పంచడం జరిగింది. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు పైబడిన వారి వరకు జనసేన పార్టీ యొక్క మేనిఫెస్టో ఎంతగానో ప్రభావితం చేసిందని, అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టోలో ఏవైతే విషయాలను తెలపడం జరిగిందో అవి కచ్చితంగా నెరవేరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, నాగేంద్ర, నాగు, ఏవి, సామియేలు, సీతయ్య, నరసింహమూర్తి అలాగే వీరమహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.