జనసేన పార్టీలో భారీ చేరికలు

  • నగర పరిధిలో 19 డివిజన్లకు అధ్యక్షుల నియామకం
  • వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారు.
  • కుల మత ప్రాంతీయ బేధాలు సృష్టించి
  • రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు.
  • ప్రజల్లో మార్పు మొదలైంది
  • అన్ని వర్గాల ప్రజలకు ఆశాదీపంగా జనసేన పార్టీ
  • అందుకే భారీ చేరికలు
  • గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్.

గుంటూరు నగరంలోని పలు డివిజన్ లకు చెందిన యువత, మహిళలు భారీ సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. ఆదివారం నగర పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ముస్లిం, మైనారిటీ, ఎస్సి, ఎస్టి యువత, మహిళలు పెద్దసంఖ్యలో జనసేనలో చేరారు. వారికి రాష్ట్ర నేతలు వడ్రాణం మార్కండేయ బాబు, మైనారిటీ నాయకులు షేక్ నాయబ్ కమాల్ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి నగర ప్రధాన కార్యదర్శి కొండూరు కిషోర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నేరెళ్ళ సురేష్ మాట్లాడుతూ వైసీపీ అధికారాన్ని చేపట్టిన క్షణం నుంచి రాష్ట్రంలో ఎవరూ ప్రశాంతంగా బ్రతకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అంటే అది నీతి నిజాయితీ కలిగిన ఒక్క పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమవుతుందన్నారు. ప్రజల్లో మార్పు మొదలైందని అందుకే జనసేన పార్టీపట్ల ప్రజల్లో రోజురోజుకీ ఆదరణ పెరుగుతుందని నేరేళ్ళ సురేష్ అన్నారు. రాష్ట్ర కార్యదర్శి నాయబ్ కమాల్ మాట్లాడుతూ ముస్లిం, మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయం మరే ప్రభుత్వం చేయలేదన్నారు. ఎన్నికలకు ముందు ముస్లింలకు ఎన్నో హామీలిచ్చిన ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే ముస్లింల గురించే మరచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం మైనారిటీలను నయవంచన చేసిన జగన్ రెడ్డికి అంతకంత ముస్లింల ఉసురు తగులుతుందని మండిపడ్డారు. రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ పరిపాలనలో పూర్తిగా విఫలమైన వైసీపీ ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చటానికి రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక ఒక్క రోడ్డు కూడా వేయలేదు అంటే పరిపాలన ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు అన్నారు. కొండ, గుట్ట, ఇసుక, మట్టి వంటి సహజవనరులను కొల్లగొడుతూ ముందుతరాల వారికి భవిష్యత్ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం పేరుతో ఒక చేతికి 10 రూపాయలు ఇచ్చి ఇష్టానురీతిలో పన్నుల రూపంలో 90 రూపాయలు లాక్కుంటున్న వైసీపీ ప్రభుత్వ దమనరీతిపై ప్రజల్లో ఆలోచన మొదలైందన్నారు. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ అవసరం ఎంతైనా ఉందన్న ఆలోచనతో ప్రజలు నిస్వార్థంగా జనసేనలో చేరుతున్నారని వడ్రాణం మార్కండేయ బాబు అన్నారు. అనంతరం నగర పరిధిలో నియమించిన 19 డివిజన్లకు అధ్యక్షులకు నియామక పత్రాలను జిల్లా ఉపాధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక, ప్రధాన కార్యదర్శి ఉప్పు రత్తయ్య, కార్పోరేటర్ లు యర్రంశెట్టి పద్మావతి, లక్ష్మీదుర్గలు అందచేశారు. ఈ సందర్భంగా 22 వ డివిజన్ నుంచి జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీనివాసరావుతోట, మస్తాన్ దర్గా, హిందూ కాలేజీ మీదుగా నగర పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ ఉపాదక్ష్యులు చింతా రాజు, యడ్ల నాగమల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిలు ఉపేంద్ర, కటకంశెట్టి విజయలక్ష్మి, మెహబూబ్ బాషా, బండారు రవీంద్ర, బుడంపాడు కోటి, త్రిపుర, నాగేంద్ర సింగ్, కొనిదేటి కిషోర్ అనసూయ తదితరులు పాల్గొన్నారు.