జనసేన పార్టీలో భారీ చేరికలు

తిరుపతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాలు నచ్చి, ఆయన అడుగులలో అడుగులు వేసి మా వంతు కష్టపడి పార్టీకి కృషి చేస్తామని తిరుపతి పెద్దకాపు వీధి నుంచి అప్పిశెట్టి శంకర్ రాయల్, వెంకటేశ్వర రెడ్డి, కాలేష, సుధాకర్ రావు, సురేంద్ర, గిరీష్, పవన్, రాజేశ్వరి తదితరులు ఆదివారం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్, తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, సుమన్ బాబుల సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోవు రోజులలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాబోతున్నారని, ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని, ఏ ఒక్క అవినీతి, అక్రమాలు దౌర్జన్యాలకు జనసేన ప్రభుత్వం పాల్పడదని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలతో పాటు, ప్రశాంతంగా స్టేట్ సుభిక్షంగా ఉంటుందని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.