కడప జనసేన పార్టీలో భారీ చేరికలు

కడప నగరంలోని యాబై మంది యువత కడప జనసేన పార్టీ నాయకులు బోరెడ్డి నాగేంద్ర అధ్వర్యంలో కడప జనసేన పార్టీ ఇన్ చార్జ్ సుంకర శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిక కండువా కప్పి జనసేన కుటుంబంలోకి ఆహ్వానించిన నియోజకవర్గ ఇన్ చార్జ్ సుంకర శ్రీనివాస్.. ఈ సందర్భంగా సుంకర శ్రీనివాస్ మట్లాడూతూ పార్టీలో చేరిన యువతను అభినందించి ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు కీలక పాత్ర పోషించాలని పిలుపు నిచ్చారు.. మహిళా, యువశక్తితో జనసేన జెండా రెపరెపలాడిస్తాం.. కడప చరిత్రను తిరగరాస్తాం.. జనసేన కు యువశక్తి, మహిళాశక్తి తోడైంది. స్వయంశక్తితో ఎదగాలి.. రాష్ట్ర సంపదను మన రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాలి.. బటన్ రెడ్డిలా కాకుండా పాదర్శకమైన పాలన అందిస్తాం.. రాష్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన బటన్ రెడ్డి..
మీతాత, అబ్బ ఆస్తో బటన్ నోక్కి ఇవ్వడంలేదు జగన్.. రాష్ట్రంలో ఎమి అభివృద్ధి చేశారు. మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లా పని చేయాలి..
యువత ఉజ్వల భవిష్యత్ అందించడం కోసం తపిస్తున్న జనసేనాని..
రాజకీయాలు డబ్బుల మాయమయ్యాయి.. దోచుకోవడం, దాచుకోవడమే ద్యేయంగా పాలన సాగిస్తున్న జగన్.. పరిపాలనా దక్షత ఉన్న నేత అవసరమనే 2014 ఎన్నికల్లో టీడీపీ నైతిక మద్దతు ఇచ్చాం. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకపోయినా ప్రశ్నించలేక పోతున్న జగన్.. భావి తరాల భవిష్యత్ కోసం పోరాడుతున్న నేత పవన్.. ఓటనే ఆయుదంతో అధికారమనే శక్తి అందించండి.. తోలుత పవన్ భావజాలాన్ని యువత నమ్మి, ఆ తర్వాత సిద్దాంతాలను ప్రజలకు వివరించి చైతన్యం తీసుకురండి.. జనసేన సిద్దాంతాలు దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు..
యువశక్తి ప్రభావం ఎలా ఉంటుందో పాలక ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా చూపండి. యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంది.. బాగా చదువుకోని ఉన్నత స్థాయికి ఎదగాలి. రాజకీయాలతో పాటు చదువు కూడా ఎంతో ముఖ్యం.. నిబద్ధతతో వ్యవహరించండి.. మహిళా, యువశక్తితో పాటు అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టుకొని కడప నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటా..ఐకమత్యంతోనే ముందుకు సాగుదాం.. ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేనందునే జనసేన వైపు అడుగులు వేశాం.. జనసేనాని పవన్ కళ్యాణ్ తోనే ఉద్యోగవకాశాలు మెరుగు పడతాయని ఆశించి పార్టీలో చేరాం అని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్ బాబు, మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కో-ఆర్డినేటర్ రంజిత్ కుమార్, పత్తి విశ్వనాద్, గజ్జల సాయి, చార్లెస్, ఉంగరాల విజయ్, నాగరాజు, శేషు రాయల్, వినయ్, దేవాకుమార్, బాలునాయక్, కుమార్ నాయక్, సుధీర్ నాయక్ తదితరులు పాల్గోన్నారు.