ఇమ్మడి కాశీనాధ్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం

పిఠాపురం, జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆశయాలు అనుసరించి మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి ఇమ్మడి కాశీనాధ్ శుక్రవారం పిఠాపురం చిత్రాడ గ్రామం సమీపంలో అన్నదాన కేంద్రం ఏర్పాటు చేసి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సుమారు 25000 మందికి నిర్విరామంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా జనసేన కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు పాల్గొని అన్నదాన కేంద్రం ఏర్పాటు చేసి, తమ ఆకలి తీర్చిన కాశీనాధ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వందల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి వచ్చిన కార్యకర్తలు, ఫ్లెక్సీల ద్వారా మార్గదర్శన పొందుతూ, అన్నదాన కేంద్రానికి చేరుకుని ఆకలి తీర్చుకున్నారని, ఇమ్మడి కాశీనాధ్ లో మరొక పవన్ కళ్యాణ్ ను చూసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి బొందిలి కాశీరాం సింగ్, కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, పొదిలి జనసేన నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు, తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాస్, మార్కాపురం నియోజకవర్గ నాయకులు విజయరావు, నరసింహారావు, బెల్లంకొండ గోపి, ప్రోగ్రాం కమిటీ సభ్యులు మరియు శతఘ్ని న్యూస్ టీమ్ సభ్యులు ఆవుల వెంకట్, ప్రోగ్రాం కమిటీ సభ్యులు మరియు శతఘ్ని న్యూస్ టీమ్ సభ్యులు వీరిశెట్టి శ్రీనివాస్, స్థానిక శంఖవరం ఇమ్మడి కాశీనాధ్ మిత్రబృందం, కాకినాడ, పిఠాపురం, చిత్రాడ గ్రామం మిత్రబృందం, మార్కాపురం నియోజకవర్గ నాయకులు మార్కెట్ శీను, వెలుగు కాశీరావు, దుగ్గిరెడ్డి రామిరెడ్డి, పూజ లక్ష్మి, సంగటి వెంకటేశ్వర్లు, బట్టగిరి మురళీధర్ రెడ్డి, బొందిలి శివ సింగ్, రొడ్డ శ్రీనివాస్, సోము వెంకట్రావు, ఛబోలు ఫణి, ఇమ్మడి హరీష్, శివ కృష్ణ మరియు ప్రకాశం జిల్లా అన్ని నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ ఘన విజయాన్ని సాధించడంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇమ్మడి కాశీనాధ్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

Share this content:

Post Comment