పామర్రు జనసేనలో భారీగా చేరికలు

కృష్ణా జిల్లా పామర్రు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీల నుంచి జనసేనలోకి భారీగా చేరికలు. పామర్రు మండలాధ్యక్షునిగా ప్రమాణం చేసిన మరుసటి రోజునే శ్రీ గుంపా గంగాధర్ ఆధ్వర్యంలో 50 మంది జనసేన పార్టీలో చేరారు. పార్టీ నియోజకవర్గం ఇంఛార్జ్ శ్రీ తాడిశెట్టి నరేష్ కండువా కప్పి వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎస్సీ, బీసీ సామాజికవర్గాలకు చెందిన వీరంతా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో, ఆయన ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు.