నెల్లూరు జనసేన పార్టీలో భారీ చేరికలు

  • ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోవడం, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్న వారిని ఇబ్బంది పెట్టడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం
  • ప్రజా ప్రభుత్వాన్ని గెలిపిస్తాం.. మా మొదటి ఓటు జనసేన కే అంటూ జనసేన పార్టీలో చేరిన యువత

నెల్లూరు: యువజన సైనికులు వర బన్నీ ఆధ్వర్యంలో దాదాపుగా 30 మంది విద్యార్థులు మా మొదటి ఓటు జనసేన కే అంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గారి కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత మూడు నెలలు కిందట మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన అంటూ యువత లో అవేర్నెస్ చేసిన జనసైనికులు బన్నీ, వరా ఆధ్వర్యంలో ఈరోజు వందల మంది యువత జనసేన పార్టీలో చేరుతున్నారు.. ప్రతి ఒక్కరు కూడా తమ భవితను కాపాడగల నాయకుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే అని నమ్మి పార్టీ చేరుతున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఎంతో నిరీక్షిస్తున్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడం, కష్టపడి చదివిన యువత అంతా కూడా వాలంటరీ ఉద్యోగాలకే పరిమితం చేయడం మోహన్ రెడ్డి లక్ష్యం అని తెలుసుకున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వకపోవడం, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్న వారిని ఇబ్బంది పెట్టడమే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాల వారికి అందగదకుండా చేస్తుంది ఈ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 20 సంవత్సరాల సర్వీసు తర్వాత ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో దానిలో 30% వరకు ఉంచి 70% వినియోగించుకోవడానికి వెసులుబాటు ఉంది ఆ ప్రయోజనం కూడా ప్రభుత్వ ఉద్యోగులు పొందకుండా చేస్తున్నారు. పోలీస్ యంత్రాంగానికి ఎన్నికలకు లభించవలసిన ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇక సరెండర్ లీవ్స్ సంగతి దేవుడికి ఎరుక, కష్టపడి పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు పెరగడ లేకపోగా ఎప్పుడు జీతాలు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్థులు ఈ ప్రభుత్వంతో విసిగిపోయి ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏదైనా కూడా తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి పనిచేసే అభ్యర్థులు గెలిపించే విధంగా యువతని మోటివేట్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జనసేన యువ నాయకులు బన్నీ, వర, కేశవా, హేమచంద్ర యాదవ్, ప్రశాంత్ గౌడ్, మౌనిష్ తదితరులు పాల్గొన్నారు.