పార్వతీపురంలో జనసైనికుల భారీ కవాతు

పార్వతీపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం మహోత్సవ శుభ సందర్భంగా ఆదివారం జనసైనికులు భారీ ఎత్తున కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతులో జనసెన పార్టీ జనరల్ సెక్రటరీ శివ శంకర్ తమ్మిరెడ్డి, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, అరకు పార్లమెంటు ఇంచార్జ్ వంపూరు గంగులయ్య, బొబ్బిలి ఇంచార్జ్ అప్పలస్వామి, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.