జనసేన మహాపాదయాత్రకు భారీ జనాదరణ: బొర్రా

సత్తెనపల్లి: మహాపాదయాత్రకు భారీ జనధారణ లభించిందని, నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువయ్యనని జనసేన సత్తెనపల్లి సమన్వయకర్త బొర్ర వెంకట అప్పారావు అన్నారు. ప్రతి గ్రామంలో టిడిపి, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. మూడో రోజు ప్రారంభమైన పాదయాత్ర భోజన విరామానికి గణపవరం చేరుకొని సాయంత్రానికి నకరికల్లు చేరుకుంది. పాదయాత్రలో భాగంగా రాజుపాలెం మండలం గణపవరం గ్రామంలో ప్రమాదవశాత్తు గాయపడ్డ మూలం వెంకటేశ్వర్లు, షేక్ రహీమ్ పరామర్శించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదవశాత్తు గాయపడ్డ రహిం కు ఆర్దికంగా సహాయం చేశారు. ధూళిపాళ్ళ నుండి నకరికల్లు వరకు ప్రతి గ్రామంలోని దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తూ పాదయాత్ర కొనసాగించారు. అన్ని గ్రామలలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలతో నివాళులర్పించారు. రోజు రోజుకి పాదయాత్రలో పాల్గొనే వారి సంఖ్య పేరుతోనే ఉందన్నారు. స్వచ్ఛందంగా జనసైనికులు, టీడీపి నాయకులు పాదయాత్రకు తరలిరావటం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. టిడిపి జగన్ జనసేన నాయకులు, కార్యకరలు, చూపించిన అభిమానం వెలకట్టలేనిదన్నరు బొర్రా. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల బాగోగులు తెలుసుకోవడం రాజకీయ నాయకుడిగా తృప్తినిచ్చిందన్నారు. పాదయాత్రలో జనసైనికులు, వీర మహిళలు జనసేన కార్యకర్తలు అభిమానులు ఆదరణ మరువ లేనిదన్నారు. నేటి యాత్రలో టీడీపీ మండల అధ్యక్షులు పల్లపాటి పెద్దిరాజు, గణపవరం గ్రామ పార్టీ అధ్యక్షులు నర్ర మల్లయ్య పాదయాత్ర లో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, ఏడో వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, సత్తనపల్లి మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, రాజుపాలెం మండల అధ్యక్షులు తోట నరసయ్య, సత్తెనపల్లి మండలం షేక్ రఫీ, చిలకా పూర్ణ, గంజి నాగరాజు, మాజీ ఎంపీటీసీ శివ, తోట రామాంజినేయులు, షేక్ కన్నా, సురేష్, ఏసుబాబు, రుద్రజడ ఆంజనేయులు, రుద్రజాడ బుల్లి అబ్బాయి, శేషు, పసుపులేటి వేంకటేశ్వర్లు, పోకల శ్రీను, షేక్ రఫీ, పసుపులేటి మురళి, నక్క వెంకటేశ్వర్లు, షేక్ మీరవలి, కొడమల శ్రీను , నామాల పుష్ప, గట్టు శ్రీదేవి, మెద్దెం మహాలక్ష్మి, అంకారావు, నాయకులు, వీరమహిళలు, తెలుగుదేశం పార్టీ, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.