ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలంలోని ఓ విద్యాసంస్థలో శనివారం జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో జనసేన పార్టీ క్రియాశీలక వాలంటీర్ మత్స. పుండరీకం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి యోగాసనాలు చేస్తూ, యోగా ద్వారా కలిగే లాభాలను వివరించారు. ఆరోగ్యవంతమైన, ఆనందభరితమైన సమాజ నిర్మాణానికి యోగా ఒక బలమైన సాధనమని ఆయన తెలిపారు. ఆరోగ్యం వ్యక్తిగతమే కాక సమాజానికి అవసరమైన మూల్యమని, శారీరక, మానసిక సమతుల్యత కలిగిన పౌరులే దేశ భవిష్యత్తుకు పునాది కాబోతారని పేర్కొన్నారు. “యోగ” అనే పదం సంస్కృతంలో “యూబ్” అనే పదం నుంచి వచ్చిందని, అది ఏకత్వాన్ని, సమన్వయాన్ని సూచిస్తుందని తెలియజేశారు. శరీరం, మనస్సు, శ్వాస మధ్య సంయోగాన్ని కుదిర్చే శాస్త్రమే యోగా అని వివరించారు. విద్యార్థులు విద్య దశ నుంచే యోగాను అలవాటు చేసుకుంటే ఆరోగ్యమే కాక ఉద్యోగ అవకాశాలు కూడా పొందవచ్చని సూచించారు. “రోజూ కాసేపు యోగా చేద్దాం – ఆరోగ్యంగా ఉండేద్దాం” అనే నినాదాన్ని విద్యార్థులతో కలసి పఠిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. ఈ వేడుకల్లో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment