*ఆటో యూనియన్ వైపు నుంచి జనసేన జానీకి సన్మానం
మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం టౌన్‌లోని శ్రీ కోటదుర్గా ఆటో యూనియన్ అంబేద్కర్ స్టాండ్‌లో మేడే కార్మిక దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా యూనియన్ సృష్టికర్త చుక్క శ్రీనివాస్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యూనియన్ ప్రెసిడెంట్ పాలకొండ ధర్మరావు, అకౌంట్స్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ లతో పాటు, ఆటో యూనియన్ నుంచి జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శిగా ఎదిగిన జనసేన జానీకి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా కోరాయి దుర్గారావు, మామిడి శ్రీనివాస్, ఐకల శ్రీనివాస్ లు మాట్లాడుతూ.. యూనియన్ ఐక్యతకు పునాది వేసిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆటో యూనియన్‌లోని వ్యక్తి జిల్లా నాయకుడిగా ఎదగడం, జనసేన అగ్రనేతలతో సంబంధాలు ఏర్పరచుకోవడం, పార్టీకి నిబద్ధంగా పని చేయడం గర్వకారణమన్నారు.
ఈ కార్యక్రమంలో భారీ కేక్ కట్ చేయడంతో పాటు, కార్మికుల ఐక్యత పెరగాలని నినాదాలు చేశారు. అనంతరం జనసేన జానీ మాట్లాడుతూ.. ఆటో యూనియన్‌కు ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పూర్తిగా మద్దతుగా ఉంటారని హామీ ఇచ్చారు.
Share this content:
Post Comment