పి.గన్నవరంలో మేడే వేడుకలు

*“కొబ్బరి వలపు కార్మికుల” ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

శ్రమదినోత్సవం సందర్భంగా కొబ్బరి తోటల్లో కష్టపడి పనిచేసే కార్మికులతో కలిసి మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రమకు గౌరవం నివ్వాలని, కార్మికుల హక్కులు పరిరక్షించాలనే సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. “కార్మికుల అభివృద్ధే గ్రామీణాభివృద్ధికి పునాది” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమానికి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం ద్వారా అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక కొబ్బరి వలపు కార్మికులు, రైతులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్మికుల శ్రమకు ఎమెల్యే ప్రత్యేకంగా నమస్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు, కార్మికులు, కార్మిక నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment