పుట్టా బాలకృష్ణ ఆధ్వర్యంలో మేడే వేడుకలు

జనసేన పార్టీ రాచర్ల మండల అధ్యక్షులు పుట్టా బాలకృష్ణ ఆధ్వర్యంలో మేడే (అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం)ను ఘనంగా నిర్వహించారు. తురుమెళ్ళ జూనియర్ కాలేజ్ సమీపంలో మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కామ్రేడ్ పూల సుబ్బయ్య గారి విగ్రహాలకు పూలమాలలు వేసి, కార్మిక సోదరుల పట్ల గౌరవం వ్యక్తం చేశారు. కార్మిక సోదరులకు మిఠాయిలు పంచి, ఒక వికలాంగ కార్మిక సోదరుడికి దుస్తులు బహూకరించడం ద్వారా మానవత్వాన్ని చాటారు. ఈ సందర్భంగా మే డే యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ, కార్మికుల హక్కులు, శ్రమకు గౌరవం మరియు సామాజిక న్యాయం పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోళ్ల రంగ సాయి, మాజీ సర్పంచ్ నారీశెట్టి వీరమ్మ, సంకతల నాగేశ్వరరావు, బెల్లంకొండ సాయిన్న, నారీశెట్టి కరుణాకర్, పార్లపల్లి శ్రీనివాసులు, బత్తిని కృష్ణయ్య, ఆసుల రమేష్, ఉల్లి ప్రభాకర్ నాయుడు, పార్లపల్లి జయసింహ, దండే నాగార్జున, గోపాల్ రెడ్డి, ఆదినారాయణ, లోకేష్ కాలేజీ స్టాఫ్ సభ్యులు మరియు పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment