శ్రామిక శ్రమకు గౌరవం తెలిపిన మేడే!

చీకటిలో చిరుదివ్వలుగా వెలిగిన రోజు మే డే. శ్రామిక శ్రమకు ప్రపంచం గౌరవం తెలిపిన ఈ రోజు సందర్భంగా ప్రతి శ్రామిక సోదరుడికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెద్దలు చెప్పినట్టుగా — శ్రమను గుర్తిద్దాం, శ్రమను చేద్దాం, శ్రమను గౌరవిద్దాం అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి. మే డే సందర్భంగా నెల్లూరు సిటీ పాత మున్సిపల్ హాస్పిటల్ వద్ద నిర్వహించిన మెడికల్ క్యాంపులో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, తెలుగుదేశం నాయకులు పట్టాభిరామిరెడ్డి, టిఎన్టియుసి నాయకులు కళ్యాణ్, యువరాజ్ మరియు అనేకమంది కార్మిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శంఖుస్తాపనల దగ్గర నుండి రోడ్లు, భవనాల నిర్మాణం వరకు, రిబ్బన్ కటింగ్ చేసే నాయకులను చాలామందిని చూశామని, కానీ వీటి వెనుక అసలైన శక్తి శ్రామికులదే అని పేర్కొన్నారు. అలాంటి శ్రామికులను గుర్తించి సన్మానించిన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. పనికి వేతన కూలీలు అనే పదం కంటే, పనికి వేతన శ్రామికులు అనే మాట శ్రామికుల గౌరవాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. అంతర్జాతీయ మే డే సందర్భంగా, శ్రామికులు కనీస వేతనం పొందే హక్కు, సురక్షితమైన పని పరిస్థితులు, సామాజిక భద్రత, వివక్ష రహిత వాతావరణం, యూనియన్లు ఏర్పాటు చేయడం, యూనియన్‌లలో చేరడం వంటి హక్కులపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రపంచ కార్మిక దినోత్సవం నాడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టి, శ్రామికులకు ఉపాధిని కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్మిక దినోత్సవ సందర్భంగా ప్రతి శ్రామికుడికి చేతి నిండా పని, జేబు నిండా డబ్బులు కలగాలని కోరుకుంటూ, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ పర్యవేక్షణలో శ్రామికుల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ తరఫున ఎల్లప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు.

Share this content:

Post Comment