ముత్యాలమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి!

*బొలిశెట్టి రాజేష్

తాడేపల్లిగూడెం, తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం ఉదయం తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తనయులు జనసేన పార్టీ యువనాయకులు బొలిశెట్టి రాజేష్ ఏలూరు రోడ్డులో ముత్యాలమ్మ దేవస్థానం, శ్రీ శ్రీ శాకాంబరి అలంకారంలో ఉన్న ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామంలో వెలసిన పారు పల్లి అమ్మవారి కి చీర సారీ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్ తోట రాజా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు భోగ, భాగ్యాలు ఆయురారోగ్యాలతో విరాజిల్లే లా అమ్మ వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి అని ఆయన కోరారు. అలానే కూటమి ప్రభుత్వ పాలనలో నియోజక వర్గంలో రాష్ట్ర విప్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చేపడుతున్న అభివృద్ధి పనులకు అమ్మ వారి ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పుల్లా బాబి, వర్తనపల్లి కాశి , కుదుళ్ళ శ్రీను, కట్టు బోయిన కృష్ణ ప్రసాద్, సోమాలమ్మ దంపతులు, మణి రాజు, కసిరెడ్డి కన్నయ్య, మద్దాల మణికుమార్, పడాల శ్రీనివాసు, కట్టిరెడ్డి దుర్గాప్రసాద్ ,అంగిన దేవేంద్ర, భీమవరపు దిలీప్, వాసా బత్తుల పోసుబాబు, మానేపల్లి రఘురాం, నీలపాల దినేష్, నీలం సురేష్, సందక రమణ, కళ్యాణం వెంకట్, అల్లం బాల, ఎర్ర వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-07-06-at-5.30.18-PM-1024x576 ముత్యాలమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి!

Share this content:

Post Comment