తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు తుది శ్వాస విడిచారని తెలిసి చింతించానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. వందల అన్నమాచార్యుల కీర్తనలకు స్వర కల్పన చేసి ఆలపించిన శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు చేసిన సేవలు చిరస్మరణీయం. ఈ తరానికి అన్నమాచార్య కీర్తనలను చేర్చేందుకు ఎంతో తపించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వర స్వామి, నవగ్రహాలపై కృతులు రచించి ఆలపించారు. శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Share this content:
Post Comment