టాయిలెట్స్ నిర్మాణానికి సిమెంట్ బ్యాగ్స్ అందజేసిన మయాన మహమ్మద్ అలీ ఖాన్
అన్నమయ్య జిల్లా, రాయచోటి అయ్యప్ప స్వామి గుడి ఆవరణంలోని టాయిలెట్స్ నిర్మాణానికి ఆర్థిక సహాయంగా సిమెంట్ బ్యాగ్స్ అందజేసిన జనసేన పార్టీ సమన్వయకర్త మయాన మహమ్మద్ అలీ ఖాన్. అయ్యప్ప స్వామి దేవస్థానం ఆవరణంలోని టాయిలెట్స్ నిర్మాణానికి జనసేన పార్టీ సమన్వయకర్త మయాన మహమ్మద్ అలీ ఖాన్ ని ఆర్థిక సహాయం చేయమని కోరగా ఆయన వంతుగా టాయిలెట్స్ నిర్మాణానికి అయ్యే సిమెంట్ బ్యాగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ ఖాన్ మాట్లాడుతూ దైవానుగ్రహంతోనే దేవాలయ నిర్మాణంలో తనవంతు సహాయంగా అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. అందరికి అయ్యప్ప స్వామి అనుగ్రహం సిద్దించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు బసిరెడ్డి, ట్రెజరీ మల్లన్న, ఏసీ నెంబర్ సురేష్ నాయుడు,జనసేన పార్టీ నాయకులు ఎన్నారై బుడ్డ నాగభూషణం, జయరాం చిన్నారి, రాజు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-08-at-10.27.47-1024x768.jpeg)