తండ్రిని పోగొట్టుకున్న చిన్నారులకు ఆర్థిక సహాయం అందించిన మేడ గురుదత్ ప్రసాద్

  • శ్రీరంగపట్నం గ్రామంలో తీవ్ర విషాదం ఘటన..

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు జానకి దుర్గా గుండెపోటుతో చనిపోయారు. విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత శ్రీ మేడ గురుదత్ ప్రసాద్ వారి ఇంటికి గ్రామ జనసైనికులతో వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మట్లాడుతూ మాట్లాడుతూ దుర్గా గారు (36) సంవత్సరాలకే చనిపోవడం చాలా దురదృష్టకరం.. అని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ నిరుపేద కుటుంబానికి జనసేన పార్టీ తరుపున ₹5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారికీ జనసేన పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది అని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, కోరుకొండ మండల ప్రధాన కార్యదర్శి వీరపురాజు పోసిబాబు, కోరుకొండ మండల ప్రధాన కార్యదర్శి కోలా జాన్ ప్రసాద్, మండపాక మురళి, చల్లా ప్రసాద్, శ్రీరంగపట్నం జనసేన పార్టీ కమిటీ ప్రెసిడెంట్ గంగాధర్, తన్నీరు తాతాజీ , కొనాల రాజు, ముత్యాల రత్నజీ, పులసల స్వామి, అడపా కృష్ణ, కొనాల కోటి బాబు, గొల్లకోటి వెంకటేశ్వరావు, జాజుల శంకరయ్య, లైటింగ్ బాబ్జి తదితరులు పాల్గొన్నారు.