వైద్య పరికరాలను విరాళమివ్వాలి: గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌కు చెందిన సింక్రోని ఫైనాన్షియల్‌ సంస్థ బుధవారం రాజ్‌భవన్‌లో మూడు అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ యంత్రాలను విరాళంగా ఇచ్చింది. ఇందులో ఒక యంత్రాన్ని నీలోఫర్‌ పిల్లల దవాఖానకు, మరో యంత్రాన్ని ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు, మూడోది రాజ్‌భవన్‌ డిస్పెన్సరీకి ఇచ్చింది. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ స్కానింగ్‌ యంత్రాలను అందించిన సింక్రోని ఫైనాన్షియల్‌ సంస్థ ప్రతినిధులను గవర్నర్‌ అభినందిస్తూ పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి వీలుగా కార్పొరేట్‌ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ దవాఖానలకు వైద్యపరికరాలను విరాళంగా ఇవ్వాలని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ కోరారు. శిశు మరణాలు తగ్గించడానికి పిల్లల ఆరోగ్య సంరక్షణపై మరింత శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.