*హాస్పిటల్ అభివృద్ధికి చైర్మన్ శ్రీనివాసరావు చర్యలు
అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంసీడీసీ) చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకొని, సమగ్ర సమీక్ష నిర్వహించారు. సుమారు ₹75 లక్షల వ్యయంతో జరుగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించిన ఆయన, పనులను వేగవంతం చేయాలని, త్వరితగతిన ప్రజల సేవకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆసుపత్రిలో ఉపలభ్యమైన మందులు, మధ్యాహ్న భోజన నాణ్యతను కూడా తనిఖీ చేసి, అవసరమైన సూచనలు ఇచ్చారు. వైద్య సేవల్లో పారదర్శకత, ప్రజలకందే సేవల నాణ్యత పెంపు దిశగా చైర్మన్ శ్రీనివాసరావు ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Share this content:
Post Comment