పాలకొండ నియోజకవర్గ జనసేన, టీడీపీ నాయకుల సమావేశం

జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, పాలకొండ నియోజకవర్గంలోని నాలుగు మండలాల జనసేన మరియు టీడీపీ నాయకులతో మరియు ఉమ్మడి అభ్యర్థి నిమ్మక జయకృష్ణతో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీడీపీ-జనసేన రాష్ట్ర సమన్వయకర్త మరియు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి సమావేశం నిర్వహించి, ఎన్నికలలో తదుపరి కార్యాచారణ గురించి సమాలోచన చేశారు.